భువనగిరి: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూడు నెలల వేతనాలు గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించాలని కార్మికుల గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని, ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీవితాలను చెల్లించి దసరా పండుగకు ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు.