శ్రీకాకుళం: నరసన్నపేట లో షెల్టర్ లేక అవస్థలు పడుతున్న 108 సిబ్బంది
108 ఈ నెంబర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆపదలో ఉన్న ఎవరికైనా సాయం అందించేందుకు సిబ్బంది హుటాహుటిన తరలివస్తుంటారు. అయితే వారు విశ్రాంతి పొందేందుకు సరైన షెల్టర్ లేకపోవడంతో నేడు అవస్థలు పడుతున్నారు. నరసన్నపేటలో 108 సిబ్బందికి స్థానికంగా వంశధార కాలనీలో ఒక పాడుబడ్డ వసతిని కల్పించారు. వర్షం పడితే కనీసం కూర్చొనేందుకు కూడా అవకాశం లేని దుస్థితి నెలకొందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.