తాడిపత్రి లోని కస్తూర్బా పాఠశాలకు మౌనిక అనే విద్యార్థిని జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు కస్తూర్బా పాఠశాల ఎస్ఓ పద్మావతి బుధవారం చెప్పారు. ఇటీవల పల్నాడు లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ 3 k రన్ పోటీలలో మౌనిక అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో సెలెక్టర్లు మౌనికను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.