పిచ్చాటూరులో మహాకాళి అవతారంలో శ్రీ ద్రౌపతి దేవి అమ్మవారు
మహాకాళి అవతారంలో శ్రీ ద్రౌపదీ అమ్మవారు పిచ్చాటూరులో 11 రోజులపాటు ధర్మరాజు స్వామి తిరుణాళ్లు వైభవంగా జరిగింది. ముగింపు రోజైన ఆదివారం సాయంత్రం కంకణం ధరించిన భక్తులు సరిహద్దులలో స్నానమాచరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా వచ్చారు. అగ్నిగుండ ప్రవేశానికి ముందు ద్రౌపదీ అమ్మవారు మహాకాళి అవతారంలో ముస్తాబై ఊరేగింపుగా అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. కంకణదారులైన భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు.