ఇబ్రహీంపట్నం: మియాపూర్ తీవ్ర విషాదం, డ్యూటీ లో ఉన్న కండక్టర్ గుండెపోటుతో మృతి
మియాపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ పండరి సకుద్దేవులతో సరదాగా మాట్లాడుతూ వాసు రూమ్ కి వెళ్ళొస్తానని వెళ్లి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందాడు. సహ ఉద్యోగులు స్పందించి వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించడంతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.