అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు పని భారం తగ్గించాలని, నూతన ట్యాబ్లు ఇవ్వాలని, రాజకీయ ఒత్తిళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, అంగన్వాడీలు పాల్గొన్నారు.