అదిలాబాద్ అర్బన్: ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని
గుడిహత్నూర్ లో ఆదివాసీల మహా పాదయాత్ర
ఎస్టీ హోదా జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని జిల్లాలో అడవి బిడ్డల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ దశాల్లో నిరసనలు వ్యక్తం చేసిన ఆదివాసీలు తాజాగా మహా పాదయాత్రను చేపట్టారు. సోమవారం గుడిహత్నూర్ మండలంలోని మాన్కపూర్ నుండి మండల కేంద్రం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), మాన్కాపూర్ రాయి సెంటర్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు తమ సాంప్రదాయ వాయిద్యాలయం అయిన తుడుం ను మోగిస్తూ పెద్ద పెట్టున నిరసన తెలిపారు.