శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలం లోని అల్లు గుండు గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నరసింహులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.