భీమిలి: మిదిలాపురి ఉడా కాలనీలో బడ్డీలు తొలగిస్తుండటం తో రోడ్డు పై బైటాయించిన చిల్లర వర్తకులు
మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో తోపుడుబండ్ల వర్తకులు రోడ్డుపై బెటాయింపు వాహనాలు పోకుండా అడ్డంగా బైటయించారు. రోడ్డుకి అడ్డంగా కూర్చుని నిరసన చేస్తున్నారు. మధురవాడ సీపీఎం కార్యదర్శి రాజకుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తోపుడుబండ్ల వర్తకులు రోడ్డుపై ధర్నా, శాంతియుతంగా వాహనాలను అడ్డుకున్నారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు తమ జీవనాధారం కాపాడాలని కోరుతూ అధికారులకు వినతి చేస్తున్నారు. రోడ్ మూసివేత కారణంగా అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలీసులు అక్కడ వర్తకులను తరలుస్తున్నారు.