అద్దెకి వచ్చామని రూమ్ శుభ్రం చేయాలని చెప్పి, గోడకి కన్నం వేసి షాపులో నగలు ఎత్తుకెళ్లిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బౌరంపేటలోని సోమేశ్వర జ్యువెలర్స్ లో శుక్రవారం అర్ధ రాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ నొక అనుకొని ఉన్న షెటర్ రూమ్ లో ఇద్దరు వ్యక్తులు అద్దెకు వచ్చామని నమ్మించి, రాత్రికి రాత్రి గోడకు కన్నం పెట్టి షాప్ లో ఉన్న వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం వచ్చి చూసి పోలీసులకు షాపు యజమాని ఫిర్యాదు చేశారు.