జమ్మలమడుగు: జమ్మలమడుగు : పులివెందుల మెడికల్ కాలేజీని వైసిపి నాయకులతో కలసి సందర్శించిన ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి సోమవారం వైసీపీ నాయకులతో కలిసి పులివెందుల సర్వజన ఆసుపత్రిని సందర్శించినట్లు నాయకులు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలికెందుకు మెడికల్ కళాశాలలపై కూటమి నాయకులు చేస్తున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రజలకు వాస్తవాలను చూపించడానికై ఈరోజు వైసిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సర్వాంగ సుందరంగా రూపు దాల్చిన పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( మెడికల్ కాలేజ్ )ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు సందర్శించారు.