రాయదుర్గం: పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అధికారులు
రాయదుర్గం పురపాలక సంఘం పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి కార్మికులకు వైద్యుల పర్యవేక్షణలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కమీషనర్ రెడ్డి తెలిపారు. పారిశుధ్య విభాగ కార్మికులు పనిచేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్యులు వివరించారు.