సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ చెత్తతో పొంచి ఉన్న ప్రమాదం
- ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలంటున్న స్థానికులు #localissue
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మీదుగా ప్రవహించే కాళంగి నది ఇప్పుడు నిండు కుండలా మారింది, వారం రోజులుగా కురిసిన వర్షాలు కారణముగా పరిసర ప్రాంతాలలో ఉన్న నదులు, కాలువలు, చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. అయితే సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని డంపింగ్ యార్డ్ దగ్గర మాత్రం ప్రమాదం పొంచి ఉంది. డంపింగ్ యార్డ్ శుభ్రం చేయడం కోసం యంత్రాలతో అక్కడ ఉన్న కాళంగి నది పొర్లుకట్టను కూడా ముందుచూపు లేకుండా లోడెయ్యడంతో అక్కడ ఇప్పుడు ప్రమాద వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం డంపింగ్ యార్డ్ డస్ట్ తో పొర్లుకట్టలాగా వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదు. నదిలోని నీటి ఉధృతికి