జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి వేళ అకస్మాత్తు తనిఖీలు మరియు ఫ్రిస్కింగ్ ఆపరేషన్ లు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో *సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీసు సిబ్బంది* పాల్గొన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిల్లోని ముఖ్య కూడళ్లు, వాణిజ్య సముదాయ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలలో పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించాక అవసరమైతే వారి సామాగ్రిని తనిఖీ చేశారు.