ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు తులసి మల్లికార్జున నాయక్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థుల హాజరై వారి రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు.