అసిఫాబాద్: లక్కీ డ్రా పద్ధతిన రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
ASF జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 2025- 27 సంవత్సరానికి గాను 4 ఎస్.సి.,1 ఎస్.టి.,2 గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం లక్కి డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్ లో జిల్లా ఆబ్కారీ- మధ్య నిషేధ శాఖ అధికారి జ్యోతి కిరణ్ లతో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ సంబంధిత డ్రా కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలోని 32 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.