అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది వద్ద లారీ బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు రిమ్స్ కు తరలింపు
ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది జాతీయ రహదారిపై లారీ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.. కేరళ నుండి నాగపూర్ కు చేపల లోడ్ తో వెళ్తున్న లారీ మంగళవారం తెల్లవారుజామున గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అబ్బు తాయార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రున్ని రిమ్స్ కు తరలించారు.