మెదక్: మండల కేంద్రంలో లీకైన గ్యాస్ సిలిండర్, తప్పిన పెను ప్రమాదం
Medak, Medak | Sep 22, 2025 లీకైన గ్యాస్ సిలిండర్ తప్పిన పెను ప్రమాదం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం ఉదయం వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ లికై బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు సిలిండర్ ను తీసుకువచ్చి బయట వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.