నాయుడుపేటలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
- పలు సమస్యలపై ప్రస్తావించిన కౌన్సిలర్లు
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా రోడ్లను ధ్వంసం చేసి మరమ్మతులు చేయని ప్రైవేట్ గ్యాస్ పైప్ లైన్ సమస్త పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అదేవిధంగా నాయుడుపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ భవన్లో కనీస వస్తువులు లేవని కోఆప్షన్ సభ్యుడు చదవాల కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్న మహిళలకు బాత్రూం వసతి లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించాలని కోరారు.