జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అల్పపీడల కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి
Ongole Urban, Prakasam | Oct 20, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. మరో రెండు రోజులపాటు వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.