పత్తికొండ: పత్తికొండలో పొలం వివాదం ఘర్షణలో నలుగురికి గాయాలు
పత్తికొండ మండలం కొత్తపల్లిలో బుధవారం పొలం హద్దుల వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో రామాంజినమ్మ, జయరాముడు, ఉచ్చీరమ్మ, నారాయణ, నౌనేపాటితో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.