ఏలూరు శివారు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఓ గుర్తు తెలియని బాలిక గాయాలతో రైల్వే ట్రాక్ ప్రక్కన ముళ్ళ పొదల్లో పడి ఉంది.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న బాలికను పరిశీలించి వైద్యం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..