మంత్రాలయం: మతిస్థిమితం లేని ఓ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన మంత్రాలయం పోలీసులు
మంత్రాలయం:మతిస్థిమితం లేని ఓ మహిళను మంత్రాలయం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొద్ది రోజుల నుంచి మంత్రాలయంలో మతిస్థిమితం లేని మహిళ ఒంటరిగా ఎక్కడపడితే అక్కడ పడుకుంటూ ఉంది. ఎస్ఐ శివాంజల్కు కొంతమంది భక్తులు విషయాన్ని తెలిపారు. కానిస్టేబుల్ రంగస్వామి మహిళను గుర్తించి విచారించగా ఆమెది ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం అని చెప్పింది. ఆమెను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.