పాణ్యం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికపై ఓర్వకల్లు, సిపిఐ హర్షం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య గారు ఎన్నిక కావడంపై సిపిఐ ఓర్వకల్లు మండల సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఏ. రమేష్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన ఈశ్వరయ్య గారు ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న నాయకుడు అన్నారు. ఆయన నాయకత్వంలో సిపిఐ ప్రజా ఉద్యమాలను మరింత బలపరుస్తుందని రమేష్ తెలిపారు.