అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నేమతాబాదు శివారులో సుబ్బారెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి బైక్ లో ఇంటికి వెళ్తుండగా గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు జీపుతో ఢీకొట్టి కర్రలు, ఇనుప రాడ్లు, కొడవళ్ళతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి గొడవలే కారణంతోనే దాడి చేసినట్టు తెలిసింది