రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలకడ మండలంలో కోటి సంతకాల సేకరణ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలకడ మండలంలో పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిఎసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు మంగళవారం చేపట్టారు. కలకడ మండలంలోని ఎనుగొండపాళెం పంచాయతీ దిగువపాళెం,బాలయ్యగారిపల్లె, నడిమిచర్ల గ్రామాల నందు కోటి సంతకాల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద ప్రజలు ఏ విధంగా నష్టపోతారో వివరించారు.అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.