ఆలూరు: పొదుపు సంఘంలో అవినీతిపై విచారణ జరిపిన, పొదుపు లీగల్ కోఆర్డినేటర్ మూర్తుజా
Alur, Kurnool | Sep 16, 2025 దేవనకొండ మండలం పి.కోటకొండలో పొదుపు సంఘంలో జరిగిన అవినీతిపై మంగళవారం పొదుపు లీగల్ కోఆర్డినేటర్ ముర్తుజా, శ్రీనిధి ఏజీఎం మేనేజర్ అబ్దుల్ సఫిక్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. శ్రీనిధికి సంబంధించిన రుణాలు 8 పొదుపు సంఘాల నుంచి వసూలు చేసిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఆ గ్రామానికి చెందిన వీఏఓ స్వాహా చేశాడని విచారణలో తేలిందన్నారు. సిబ్బంది కర్రెన్న, సోమన్న, మల్లేశ్ పాల్గొన్నారు.