చెరువును తలపిస్తున్న పరమేశ్వరి నగర్ లోని ఖాళీ స్థలం
నెల్లూరు కార్పొరేషన్ లో నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కార్పొరేషన్ పరిధిలో ఉండే ఖాళీ స్థలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆ స్థలాలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరిపోతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో.. దోమలు ప్రబలి అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఖాళీ స్థలాల్లోనే వర్షపు నీరు దృశ్యాలు కనిపిస్తున్నాయి.