మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులం, మతం పేరుతో ఏళ్ల నుంచి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన సంఘ సంస్కర్త పెరియార్ అని కొనియాడారు. బహుజన సమాజం ఆయన మార్గంలో నడవాలని కోరారు.