కళ్యాణదుర్గం: బోరంపల్లి లో భార్యపై హత్యాయత్నం చేసిన భర్తను అరెస్టు చేసిన పోలీసులు
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి లో బుధవారం రాత్రి రత్నమ్మ అనే మహిళను ఆమె భర్త ఎర్రి స్వామి కత్తితో గొంతు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వెంటనే ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం అరెస్టు చూపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రత్నమ్మను ఎర్రి స్వామి హత్యాయత్నం చేసినట్లు రూరల్ సీఐ హరినాథ్ చెప్పారు. ఈ ఘటనపై లోతుగా విచారణ, దర్యాప్తు చేస్తున్నామన్నారు.