అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో తెలుగు రచయిత, అభ్యుదయ పితామహుడు గురజాడ అప్పారావు 110వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సంఘం కోశాధికారి జెన్నే కుళ్ళాయిబాబు, కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అన్నారు. ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం సభ్యులు హాసన్ అహ్మద్, నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి పాల్గొన్నారు.