శ్రీశైలం మహా క్షేత్రంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై గట్టి బందోబస్తు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు,ఇదే క్రమంలో క్షేత్రానికి తరలివస్తున్న వాహనాలను టోల్గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు,ఇదే క్రమంలో టోల్గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, కొందరు వ్యక్తులు సుమారు రెండు వందల కేజీల మాంసం మద్యం మరియు మాంసాహారాలను శ్రీశైలంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు, వారిని అడ్డుకున్న ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, వారి వద్ద నుంచి మధ్యము మరియు మాంసాహారాన్ని స్వాధీన పరుచుకున్నట్లు మీడియాకు వెల్లడించారు,