రేణిగుంట మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం రేణిగుంట మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల సమస్యలు వంటి పలు అంశాలపై సభ్యులు చర్చించారు. అధికారులు విభాగాల వారీగా నివేదికలు సమర్పించి సూచించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.