మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో బ్లూ కొల్ట్ పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఆటో డ్రైవర్ జాడి రాఘవపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం స్థానిక ఎస్సై కె. శ్వేత తెలిపారు. మంచిర్యాలకు చెందిన రాఘవ రాంగ్ రూట్లో, అతివేగంగా ఆటో నడుపుతూ ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఇబ్బంది కలిగించినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపిన,రాంగ్ రూట్ వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.