జమ్మలమడుగు: గోపవరం : ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం
కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డు, పుచ్చలపల్లి సుందరయ్య నగర్ ప్రజలు పి.ఎస్. నగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని సోమవారం సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల నుండి గోపవరం ఎమ్మార్వో ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర శేఖర్ మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలోని జనాభాలో 30% కమ్యూనిస్టులు వేసిన కాలనీలలో ప్రజలు జీవిస్తున్న వాస్తవాన్ని పాలకులు ఉన్నతాధికారులు గమనించాలన్నారు. స్థానికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.