శంకరంపేట్ ఆర్: 100% ఇంటి పన్నులు సేకరించాలి : డిఎల్పిఓ సురేష్ బాబు
చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం డిఎల్పిఓ సురేష్ బాబు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ లు, టవర్ లైసెన్సులు, ప్రతి గ్రామంలో 100% ఇంటి పన్నులు సేకరించాలని గ్రామపంచాయతీలో ప్రతి సర్టిఫికెట్ ఆన్లైన్లో ప్రజలకు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి, పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు.