కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కనిగిరి మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ... కనిగిరి శాసనసభ్యునిగా తిరుపతి నాయుడు పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నత నాయకుడు తిరుపతి నాయుడు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.