దేవరదిన్నె వద్ద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో, తప్పిన పెను ప్రమాదం
దేవరదిన్నె వద్ద రోడ్డు పై పారుతున్న నీటి ప్రవాహానికి ప్యాసింజర్ ఆటో కొట్టుకుపోగా పెను ప్రమాదం తప్పింది. స్థానికులు బుధవారం తెలిపిన వివరాల మేరకు కేవిపల్లి మండలం మదిపట్ల వాండ్లపల్లి పంచాయతీ దేవరదిన్నె వద్ద మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువు నిండి పెద్ద ఎత్తున మొరవ నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలాఉండగా బుధవారం ఉదయం హరిజనవాడ కు చెందిన ఆటో డ్రైవర్ కృష్ణయ్య భారీ నీటి ప్రవాహంను అంచనా వేయకుండా ఆటోను నీటిలో దాటే ప్రయత్నించగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో అదుపు తప్పి కృష్ణయ్య వాహనంతో సహా నీటిలో కొట్టుకుపోయి నిలిచింది