వైసీపీ నేతలు ఎవరూ భయపడొద్దు : మాజీ మంత్రి కాకాణి
Gudur, Tirupati | Sep 14, 2025 తిరుపతి జిల్లా గూడూరు నియోజక వర్గం చిల్లకూరు(M) మోమిడిలో ఆదివారం వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మురళీ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వేమారెడ్డిపై అక్రమ కేసులు పెట్టిందని కాకాణి మండిపడ్డారు. కార్యకర్తలు, నేతలు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు