కుప్పం: సామగుట్టపల్లిలో మంచినీటి కష్టాలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
కుప్పం మున్సిపాలిటీ సామగుట్టపల్లిలో మంచినీళ్ల కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన బోరులో నీటిమట్టం తగ్గడంతో గ్రామస్థులకు సరిపడా నీరు రావడం లేదు. దీనికి తోడు గ్రామంలో నీటి కుళాయిలు లేకపోవడంతో పబ్లిక్ టాప్ వద్ద నిత్యం గొడవలు పడాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. కుళాయిల్లో నీళ్లు రాకపోవడంతో పైపుల నుంచి నీళ్లు తోడుకుంటున్నారు.