గుంతకల్లు: గుత్తిలో భారీ వర్షం, 21.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
గుత్తి లో బుధవారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. 21.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎమ్మెస్ ఫుట్బాల్ క్రీడా మైదానం, ఎల్ ఎం బాలుర పాఠశాలలో వర్షం నీరు చేరింది. ఎక్కడ చూసినా వర్షం నీరే కనిపిస్తున్నది. విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.