క్రిమిసంహారక ముందు సేవించి వ్యక్తి మృతి కేసు నమోదు
క్రిమిసంహారక మందు సేవించి చలమకోటి వెంకట రమణ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కలికిరి మండలం తుమ్మలపేట వడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కలికిరి పోలీసులు శనివారం తెలిపిన వివరాల మేరకు కలికిరి మండలం కలికిరి పంచాయతీ తుమ్మలపేట వడ్డిపల్లి కి చెందిన చలమకోటి వెంకట రమణ(56)అనే వ్యక్తి కుటుంబ ఖర్చుల కొరకు మరియు ఇతర అవసరాల కొరకు పలువురి దగ్గర అప్పులు చేశాడు. అయితే స్థానికంగా అప్పులు తీర్చలేక సంపాదన కోసం కేరళకు వెళ్లాడు. అయితే అక్కడ కూడా సంపాదన లేక పోవడంతో తిరిగి ఇంటికి వచ్చి అప్పు తీర్చలేనని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం క్రిమి సంహారక మందు సేవించి మృతి చెందాడు