రాయదుర్గం: పెండింగ్ కేసుల పరిష్కారం లో ఉత్తమ సేవలందించిన రాయదుర్గం సిఐ లు జయనాయక్, వెంకటరమణ లను అభినందించిన జిల్లా ఎస్పి జగదీష్
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారం చేయడంతోపాటు ఉత్తమ పోలీసు సేవలు అందించిన రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐ లు జయనాయక్, వెంకటరమణ లను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా కేంద్రంలో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసు ఆఫీసర్ లను ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ప్రసంశ పత్రాలు అందుకున్న వారిలో ఎస్ఐ ప్రసాద్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.