యాడికి మండల కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో బుధవారం ధనుర్మాస వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని చెన్నకేశ స్వామి ఆలయం, బోయరెడ్డిపల్లి లోని సీతారాముల ఆలయంలో ధనుర్మాసం పూజలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు వంటి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.