3 రోజులు జాగ్రత్తగా ఉండండి : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
భారీ వర్షాలకు వెంకటగిరిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మల్లమ్మ గుడి నుంచి శివాలయానికి వెళ్లే దారిలో లోలెవల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. చింతచెట్టు వద్ద స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అధికారులందరూ 3రోజులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆహారం, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట CI ఏవీ రమణ, కమిషనర్ వెంకటరామిరెడ్డి ఉన్నారు.