జలకలను సంతరించుకున్న నెల్లూరులోని పెన్నా బ్యారేజ్
నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ జలకల సంతరించుకుంది. ఇటీవల నాలుగు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో కూడా కురుస్తున్న వర్షాలకి వరద నీరు సోమశిల జలాశయానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో సోమశిల జలాశయం నుంచి అధికారులు గురువారం కూడా నీటిని దిగు ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో సోమశిల జలాశయం నుంచి పెన్నా బ్యారేజ్ కి నీరు వస్తుంది.