కామవరపుకోట చెక్ పోస్ట్ సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదం
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రహదారిలో కామవరపుకోట చెక్పోస్ట్ సమీపంలో కారు అదుపుతప్పింది. సోమవారం సాయంత్రం కారు రోడ్డు మార్జిన్ నుంచి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొని కంపల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. తడికలపూడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.