నారాయణ్‌ఖేడ్: చరిత్రను బిజెపి వక్రీకరిస్తుంది : నారాయణఖేడ్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
చరిత్రను బిజెపి వక్రీకరిస్తుందని నారాయణఖేడ్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి విమర్శించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్లో ఆయన బుధవారం మాట్లాడారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర మంత్రిగా ఉండి సైనిక చర్య ద్వారా తెలంగాణ ను భారతదేశంలో కలపడం జరిగిందని తెలిపారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రాజకీయం అంటగట్టడం సమంజసం కాదన్నారు. చరిత్రను ప్రజలు మర్చిపోరని గుర్తు చేశారు.