గూడూరు సబ్ కలెక్టరేట్ ఆఫీసు వద్ద ధర్నా
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే లక్ష్యమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ప్రమాదాలలో చాలామంది కార్మికులు అంగవైకల్యం చెందారని, కొంతమంది చనిపోయారని వారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం నుంచి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.