అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామంలో సోమవారం పయ్యావుల సోదరుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతపురం నుంచి మ్యాగ్నస్ హాస్పిటల్ వైద్యాధికారుల చేత మండల టీడీపీ కన్వీనర్ ప్రసాద్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరంలో దాదాపు 200 మందికి పలు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు.